సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ సమీపంలో నేడు, బుధవారం తెల్లవారు జామున ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పి ప్రమాదవశాత్తు ప్రక్కకు వరిగిపోయింది .డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. అయితే ప్రక్క పట్టాల రైల్వే ట్రాక్ లపై రైళ్లు వెళ్ళడానికి ఇబ్బంది ఎదురుకావడంతో.. ప్రస్తుతం కేవలం ఒక్క ట్రాక్ ఫై మాత్రమే రైళ్లను అనుమతిస్తున్నారు . ఈ క్రమం లో 9 రైళ్లు రద్దయ్యాయి. రెండు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈరైల్వే సిబ్బంది అక్క డికి చేరుకుని మరమ్మత్తులు చేపట్టారు.రద్దయిన వాటిలో పశ్చిమ గోదావరి జిల్లా ఫై నుండి నడిచే విజయవాడ నుంచి విశాఖపట్నం , గుంటూరు-విశాఖపట్నం, విజయవాడ-కాకినాడ పోర్టు మధ్య నడిచే రైళ్లు ఉన్నాయి. విజయవాడ- లింగంపల్లి (12805) రైలును 2 గంటల ఆలస్యంగా నడుపనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *