సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కాకినాడ జిల్లా పిఠాపురం- సామర్లకోట వద్ద నేటి సోమవారం మధ్యాహ్నం ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. విశాఖ నుంచి విజయవాడ మార్గంలో గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీనితో అదే పట్టాల మీద నుండి వెళ్లే యశ్వంత్పూర్, రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైళ్లను రైల్వే అధికారులు నిలిపివేశారు. ఘటనా స్థలం లో సిబ్బంది ఆఘమేఘాలపై పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. దీనితో విజయవాడ మీదుగా వెళ్లే కొన్ని కీలక రైళ్లు ప్రయాణాలు లో కొద్దీ గంటల ఆలస్యం కానున్నాయి.
