సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వరుస పరాజయ పరంపర లో ఉండి దాదాపు 5 ఏళ్ళ విరామం తరువాత బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ హీరోగా, దీపికా పదుకొనె అందాలు ప్రత్యేక ఆకర్షణగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పఠాన్’ జాన్ అబ్రహాం కీలక పాత్రలు పోషించారు. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ ధూమ్ సిరీస్ తరహాలో భారీ బడ్జెట్తో రూపొందించింది. మంచి టాక్ సాధించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నిన్న జనవరి 25న విడుదలైంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా నేడు, గురువారం అందిన రిపోర్ట్ ప్రకారం బాలీవుడ్ చరిత్రలోనే ఈ చిత్రం సంచలనం రేపుతోంది. ఈ సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.106కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇండియాలో హిందీ వెర్షన్ రిలీజ్ డే నాడు రూ.55కోట్ల నెట్ కలెక్షన్స్ను కొల్లగొట్టింది. డబ్బింగ్ వెర్షన్స్ నుంచి మరో రెండు కోట్లు వచ్చాయి. అంటే ‘పఠాన్’ తొలిరోజు నెట్ వసూళ్లు ఇండియాలో రూ.57కోట్లు.. గ్రాస్ కలెక్షన్స్ రూ.67కోట్లు అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్స్ నుంచి రూ.39కోట్లను రాబట్టింది.ఈ సినిమాను దాదాపుగా రూ.250కోట్ల భారీ బడ్జెట్తో రూపొందించారు.
