సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం బెంగళూరు లో నిర్వహించిన TDPఫోరం సమావేశంలో తెలుగు దేశం పార్టీ అధినేత అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. పేదరికంలేని సమాజం చూడాలనేది నా జీవిత ఆశయం. వ్యవసాయ కుటుంబంలో పుట్టి తన హయాంలో సీఎంగా హైదరాబాద్ ను ఐటి హబ్ గా అభివృద్ధి చేసానని లక్షలాది యువతకు ఉపాధి లభిస్తుందన్నారు.పది మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి విద్యార్థులు, యువత ఎదగాలి. నన్ను మొదటిసారి గెలిపించింది విద్యార్థులే’’ అని చంద్రబాబు చెప్పారు. ప్రపంచంలోనే తెలుగువారు నెంబర్ వన్ గా ఉండాలనేది తన ఆకాంక్షని అన్నారు. అంతకుముందు బెంగళూరుకు చేరుకున్న చంద్రబాబు. కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు త్రిలోక్ ను పరామర్శించారు. చంద్రబాబు అరెస్టు సమయంలో కుప్పంలో ఆందోళన చేస్తున్న త్రిలోక్ ప్రమాదానికి గురయ్యారు. తీవ్ర అనారోగ్యానికి గురైన త్రిలోక్ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులతో మాట్లాడారు.పార్టీ అండగా ఉంటుందని వారికి చంద్రబాబు భరోసా ఇచ్చారు.
