సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో ఆధార్ కార్డు కలిగిఉన్న వారికీ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ(యూఐడీఏఐ) కీలక సూచన చేసింది. పదేళ్ల క్రితం ఆధార్ నంబర్ తీసుకున్న వారు వెంటనేతమ గుర్తింపు, నివాస రుజువులతో వివరాలను అప్డేట్ చేసుకోవాలని కోరింది. దరఖాస్తు ఫారాలు ఆన్ లైన్ లో ” మైఆధార్” పోర్టల్ నుంచి లేదా ఆధార్ సేవా కేంద్రాల నుంచి చేసుకోవచ్చని సూచించింది. పదేళ్ల క్రితం ఆధార్ తీసుకుని, తర్వాతి కాలంలో ఒక్కసారికూడా అప్డేట్ చేసుకోనివారు. తమ ప్రస్తుత వివరాలను అందించాలని కోరింది. వివిధ ప్రభుత్వ పథకాలు, సేవలకు ఎటువంటి అవాంతరాల్లేకుండా ప్రభుత్వం ద్వారా ప్రయాజనాలు పొందాలంటే వ్యక్తులు తమ ఆధార్ డేటాను అప్డేట్ చేసుకోవాలి’’అని ఐఆర్డీఏఐ ప్రకటించింది.
