సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎస్‌సీ ఈ-గవర్నెన్స్‌ సర్వీస్‌ ఇండియా లిమిటెడ్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో జిల్లా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఆధార్‌ సూపర్‌వైజర్‌, ఆపరేటర్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 282 ఆధార్‌ సూపర్‌వైజర్‌, ఆపరేటర్‌ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 31, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టులను అనుసరించి పదో తరగతితోపాటు మూడేళ్ల పాలిటెక్నిక్‌ డిప్లొమా లేదా ఇంటర్‌ లేదా పదో తరగతితోపాటు రెండేళ్ల ఐటీఐలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే పని అనుభవం కూడా ఉండాలి. అలాగే అభ్యర్ధులకు ఆధార్‌ ఆపరేటర్‌ లేదా సూపర్‌వైజర్‌ సర్టిఫికెట్‌ కూడా తప్పనిసరిగా ఉండాలి. కంప్యూటర్‌ బేసిక్‌ నాలెడ్జ్‌ ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 18 ఏళ్లు, అంతకుపైన ఉండాలి. ఆధార్‌ సూపర్‌ వైజర్‌ పరీక్షను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *