సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ శివారులోని పెద్దమిరం లో కాన్సర్ చికిత్స కు ఖ్యాతి గాంచిన మహాత్మా గాంధీ మెమోరియల్ మెడికల్ ట్రస్టు నిర్వాహకులు , స్వర్గీయ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ కు సహచర మిత్రులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత M రామకృష్ణ రాజు( ఎం ఆర్ రాజు)కు జాతిపిత మహాత్మా గాంధీ 154 వ జయంతి సందర్భంగా సర్వోదయమండలి మహాత్మా గాంధీ శాంతి పురస్కారమును ఆయనకు అందించింది .సర్వోదయ మండలి ప్రతినిధులు మృదుల, ఇందుకూరి ప్రసాదరాజు చెరుకువాడ రంగసాయి తదితరులు ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ మెమోరియల్ మెడికల్ ట్రస్టులో డాక్టర్ ఎం ఆర్ రాజుకు పురస్కారం అందించడంతో పాటు ఘన సత్కారం చేశారు .నూలు పోగుల దండతో ,పూల కిరీటంతో, పుష్ప గుచ్చములతో ఆయనను సత్కరించారు.ఈ సందర్భంగా ఉండి ఎం ఎల్ ఏ, మంతెన రామరాజు మాట్లాడుతూ డాక్టర్ రాజు తమ నియోజకవర్గమునకు చెందిన వారు కావడం తమ అదృష్టం అన్నారు విదేశాల్లో పరిశోధనలు చేసి శాస్త్రవేత్తగా, మానవతా వాదిగా సేవలు అందించి డాక్టర్ ఎమ్మార్ రాజు మహాత్మా గాంధీ మెమోరియల్ మెడికల్ ట్రస్ట్ ను స్థాపించి వైద్య సేవలు అందించారని అభినందించారు. గత కాలపు రాష్ట్రపతి అబ్దుల్ కలాం ,అటమిక్ కమిషన్ చైర్మన్ డాక్టర్ అనిల్ కాకోద్గర్ లు మహాత్మా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ ను సందర్శించిన రోజులను ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్స్, స్వచ్చంద సేవకులు పాల్గొనడం జరిగింది.
