సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ ప్రజలకు సుదీర్ఘ కాలంగా దోమల బాధ, పలు ప్రాంతాలలో మంచినీటి సరఫరా లో కలుషితనీరు పంపిణి సర్వసాధారణం. దోమల నివారణకు ప్లాగింగ్ మిషన్ కానీ డ్రైన్స్ లో మందులు చల్లటం, అపరిశ్రుద్ద ప్రాంతాలలో ముగ్గు చల్లటం వంటి సాధారణ విధులు కూడా చాల అరుదుగా కనిపిస్తాయి. అయితే ఆస్తి పన్ను వసూళ్లలో దశాబ్దాలుగా రాష్ట్రంలోనే భీమవరం మున్సిపాలిటీ పన్ను వసూళ్ళలో మాత్రం మొదటి టాప్ ర్యాంక్ లో ఉంటుంది. ఏటా సుమారు రూ.21 కోట్ల మేర పన్ను వసూలు చేస్తున్నారు. అయితే వాస్తవానికి ఏడాదికి రూ.23 కోట్లు డిమాండ్‌ ఉన్నప్పటికీ ఇటీవల భీమవరం పన్ను వసూళ్ళలో వెనుకబడింది. దీనికి కారణం గత ప్రభుత్వం హయాంలో భీమవరం చుట్టుపక్కల గ్రామాలయిన చినఅమిరం, రాయలం, తాడేరు, కొవ్వాడ అన్నవరం విలీనం చేశారు. దానితో ఆ గ్రామాల ఆస్తి పన్ను ఏటా రూ.1.50 కోట్ల మేర పన్ను డీమాండ్ వసూళ్ల బాధ్యత ను మున్సిపాలిటీ రికార్డుల్లో నమోదు చేశారు. అయితే ఈ విలీనం సవాల్ చేస్తూ ఆ గ్రామాల వారు కోర్టుకు వెళ్లారు. సమస్య ఉండటంతో అక్కడ పన్ను వసూళ్లు పట్టణానికి కలవడం లేదు. దీనితో. పన్ను వసూళ్ల ర్యాంకులో భీమవరం వెనుకబడి వుంది. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం భీమవరం మున్సిపాలిటీ నుంచి విలీన గ్రామాల పన్ను డిమాండ్‌ను మున్సిపాలిటీ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీనితో పన్ను వసూళ్ల అధికారులు ఊపిరి పీల్చుకొన్నారు.మరల పన్ను వసూళ్ళలో రాష్ట్రంలో టాప్ ర్యాంకు కు దూసుకొనిపోవడం ఖాయం. అలాగే ప్రజల సమస్యల పరిష్కారంలో కూడా టాప్ ర్యాంక్ లో ఉంటె మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *