సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ నేడు, మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు లోపే ప్రజలకు వారిపై ఉన్న భ్రమలు అన్ని తొలగిపోయాయని, మోసపోయాం అని అందరికి తెలిసిపోయిందని, పధకాలు మాట అటుంచితే అభివృద్ధి కూడా క్షిణించిపోయిందని .. కూటమి నేతలు దోచుకో.. దాచుకో.. పంచుకో.. కి పరిమితం అయ్యారని రాష్ట్రానికి ఆదాయం అడుగంటిపోయిందని వాళ్ళ జేబులు రోజు ఎన్ని కోట్లు నిండుతున్నాయో మాత్రమే లెక్కలు వేసుకొంటున్నారని ఆరోపించారు. ఇసుక మొదలు పెడితే అన్ని ధరలు మా హయం కన్నా 2ఇంతలు పెరిగిపోయాయని, లిక్కర్ ధరలు పెంచేశారని,ఏకంగా సొంత ఫ్యాక్టరీలు పెట్టి డూప్లికేట్ మద్యం వారే బ్రాండ్ లు వేసి అమ్మేసుకోని ప్రజలు ప్రాణాలు తీస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. అన్ని ప్రభుత్వ ఆస్తులు ప్రెవేటు పరం చేస్తూ తమ సన్నిహితులకు పిపిపి పథకం పేరుతొ దోచిపెడుతున్నారని, దీనిని అడ్డుకొనేందుకు అక్టోబరు 9న నర్సీపట్నం మెడికల్‌ కాలేజీని సందర్శిస్తాను అని వైఎస్ జగన్ తెలిపారు. అక్టోబరు 10 నుంచి నవంబర్‌ 22వరకూ రచ్చ బండ కార్యక్రమం ఉంటుందని, మెడికల్‌ కాలేజీల ప్రైవటీకరణ నిరసిస్తూ కోటి సంతకాలను రచ్చ బండ కార్యక్రమాల ద్వారా సేకరిస్తామని,అక్టోబరు 28న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు ఉంటాయి. జిల్లా కేం ద్రాల్లో నవంబర్‌ 12న ర్యాలీలు జరుగుతాయి. ఈ సంతకాలు గవర్నర్‌ గారికి అప్పగిస్తామని అన్నారు. ఇటీవల ‘ప్రభుత్వ స్కూళ్లలో ఐదు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. మన హయాంలో నో వేకెన్సీ బోర్డులు చూశాం. ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కడం ఇప్పుడు చూస్తున్నాం , ఎరువుల పంపిణీలో కూడా స్కాం చేశారు. దళారీలతో చేతులు కలిపారు. ప్రజారోగ్య వ్య వస్థను పూర్తిగా దెబ్బ తీశారు. అని మాజీ సీఎం మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *