సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ప్రజలు పరిసరాలను పరిశుభ్రం చేసుకోవడం అందరి బాధ్యత అని, కొన్ని దేశాలు వ్యర్థాలతో అద్భుతాలు చేస్తున్నాయని అన్నారు ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ .. కరోనా మహమ్మారి వంటి పరిస్థితుల్లో శుభ్రత గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో ‘స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్’ కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో ఆయన కల్యాణ్ మొక్కలు నాటారు, అనంతరం పారిశుద్ధ్య తరలింపు వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.ఆయనతో పాటు రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పాల్గొన్నారు. పంచాయతీల పరిధిలో చేస్తున్న స్వచ్ఛత కార్యక్రమాలు, డంపింగ్ యార్డులు, చెత్తను వేరు చేసే క్రమం వంటి విషయాలను స్వయంగా పంచాయతీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు పవన్. చెత్త ట్రాక్టరును స్వయంగా పవన్ కళ్యాణ్ నడిపి, స్వచ్ఛతలో తాను కూడా భాగమనే సందేశాన్ని నింపారు.
