సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ఎన్నికలు ముగిసాక కొద్దీ రోజులకు రిలీఫ్ కోసం అగ్రనేతలు విదేశాలకు వెళ్లారు. అయితే సీఎం జగన్ మాత్రమే తాను లండన్ వెళుతున్నట్లు ప్రకటించారు. ఇక చంద్రబాబు , పవన్ లు హైద్రాబాద్ లో తమ నివాసాలు కు చేరుకొని అటునుండి కాశీ వెళ్లి గోప్యంగా విదేశాలకు పయనమయ్యారు. ఇటీవల నే విదేశీ పయనం పూర్తీ చేసుకొని చంద్రబాబు వచ్చేసారు. ఇక పవన్ విషయానికి వస్తే ఆయన కూడా ఏ దేశానికీ వెళ్లారో? తెలియదు కానీ, నిన్ననే హైదరాబాద్ లో తన నివాసానికి చేరుకొన్నట్లు తెలుస్తుంది. వచ్చిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కొద్దీ సేపు గడిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకటి 2 రోజులలో ఏపీలోని మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకొంటారని భావిస్తున్నారు. ఇక సీఎం జగన్ రేపు విజయవాడ చేరుకొంటారు. ఇక ఎలానూ జూన్ 1 నుండి ఎగ్జిట్ పోల్ సందడి. జూన్ 4 న డైరెక్ట్ ఫలితాలు.. ఇది సంగతి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *