సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన నేడు, శుక్రవారం ఉదయం సచివాలయంలో ప్రారంభమైన రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి , ఉడ్జ్యోగులు ఆందోళన నేపథ్యంలో, ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీకి కేబినెట్‌ ఆమోదం తెలిపిందని మంత్రి పేర్నినాని తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఉద్యోగ సంఘాలకు నచ్చజెప్పేందుకు కమిటీ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశామని వివరించారు. దీనిలో భాగంగా మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ సమీర్ శర్మలను కమిటీలో సభ్యులుగా చేర్చారు. ఉద్యోగులకు వాస్తవ పరిస్థితులు వివరించి, అపోహలు తొలగించాలన్నారు. ఇంకా పలు పలు కీలక అంశాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది అన్నారు. ఉద్యోగులు రిటైర్మెంట్‌ వయసు 62 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ఉద్యోగులకు జగనన్న టౌన్‌షిప్ లలో ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన కేబినెట్‌.. టౌన్‌షిప్‌లలో 10 శాతం ప్లాట్లు 20 శాతం రిబెట్ తో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈబీసీ నేస్తం అమలుకు ,అగ్రవర్ణాల పేద మహిళలకు 45 వేలు ఆర్థిక సహాయం కు కాబినెట్ ఆమోదించింది. ఏటా 15 వేలు చొప్పున 45 ఏళ్ళ నుండి 60 ఏళ్ల మధ్య పేద మహిళలకు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *