సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కృష్ణాజిల్లా కంకిపాడు నుండి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు, సోమవారం గ్రామ పంచాయతీల అభివృద్ధే ధ్యేయంగా పల్లె పండుగ ను ప్రారంభించారు. పవన్ మాట్లాడుతూ.. పల్లె పండుగ_ పంచాయితీ వారోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల రూపురేఖలను మార్చనుంది. ప్రతి గ్రామంలో పనుల పురోగతి, నిధులు చెల్లింపుపై డిస్ ప్లే బోర్టులు ఏర్పాటు చేశాం. మేము పారదర్శకంగా ఉన్నప్పటికీ.. అధికారులు కూడా బాగా పని చేయాలి. ఓ ఐఎఫ్‌ఎస్ అధికారి నా పేరు చెప్పి డబ్బులు అడగినట్లు తెలిసింది. నా దృష్టికి రాగానే విచారణ చేసి, అవసరమైతే సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశాం. అవినీతి అధికారులు మాకు వద్దు. ఎవరు లంచం పేరుతో ఇబ్బంది పెట్టినా మా దృష్టికి తీసుకురండి.అయితే గత వైసీపీ అధికారంలో ఉండగా ఎప్పుడైనా ప్రజా సమస్యలను పరిష్కరించారా అని ప్రశ్నించారు. “వైసీపీ హయాంలో151 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు.వారు ఎంతసేపు వారి నోటి వెంట బూతులు, తిట్లు తప్ప, ప్రజల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి కానరాలేదు”అని పవన్ విమర్శించారు.
