సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నేడు, ఆదివారం చిన్నారులకు చుక్కల మందు .. పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కేంద్రం భీమవరం 24 వ వార్డు యు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ , జాతీయ ఇమ్యూనైజేషన్ దినోత్సవం సందర్భంగా జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆయన తదుపరి 23వ వార్డుల సచివాలయంలో కూడా చిన్నారులకు చుక్కల మందు వేశారు. 5 ఏళ్ళ లోపు ప్రతి చిన్నారికి ఈ చుక్కల మందు వేసి అంగవైకల్యం నుండి వారి భవిషత్తు ను కాపాడాలని పిలుపు నిచ్చారు. ఈ రోజు ఉదయం భీమవరం దుర్గాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శాసన మండలి ఛైర్మన్ కొయ్యే మోషేను రాజు ప్రారంభించారు. రేపు ఎల్లుండి కూడా పట్టణంలో ఇంటిటికి వాలంటీర్లు సహకారం తో ఇంకా చుక్కల మందు వేయించని పిల్లల కు ఆరోగ్య శాఖ అధికారులు కార్యక్రమం నిర్వహిస్తారు, నేటి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పల్స్ పోలియో కార్యక్రమమును పట్టణంలోని వార్డు సచివాలయాలతో పాటు బస్సు స్టాండ్ రైల్వే స్టేషన్లలో కూడా నిర్వహించారు.
