సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పవర్ స్టార్ పవన్ కళ్యా ణ్- మాజీ భార్య రేణు దేశాయ్ గురిం చి ప్రత్యేకం గా చెప్పనవసరం లేదు. బద్రి, జానీ సినిమాల షూటింగ్ సమయంలో ప్రేమించుకొని.. సహజీవనం చేసి ఒక బిడ్డకు జన్మ నిచ్చి తరువాత పెళ్లి చేసుకున్నారు. ఆ బిడ్డనే అకీరా నందన్. ఆ తరువాత ఈ జంటకు ఆద్య అనే అమ్మాయి పుట్టింది. ఇక కొన్ని విబేధాల కారణంగా ఈ జంట విడిపోయినా పవన్ ను రేణు దేశాయ్ ఎంత విమర్శించిందో.. అంతే గౌరవిస్తూ వస్తుంది. ఇప్పటికి పవన్ ఫ్యాన్స్ ఆమెను వదిన గౌరవం ఇస్తుంటారు. అయితే నేడు శనివారం అకీరా నందన్ 19 వ పుట్టినరోజు కావడంతో అభిమానులు విషెస్ చెప్తున్నారు. ఇక అందులో ఒక పవన్ అభిమాని ..” మ్యామ్ .. ఇది చాలా అన్యాయం . మా అకీరాను ఒక్క సారి అయినా చూపించండి… మా అన్న కొడుకును చూడాలని ఉంటుంది మాకు. మీరు హైడ్ చేయకండి. అప్పుడప్పుడు అయినా వీడియోస్ లో అకీరా బాబును చూపించండి” అంటూ కామెంట్ పెట్టగా.. దానిపై రేణు ఫైర్ అయ్యింది. ” మీ అన్న కొడుకు..? అకీరా నా అబ్బాయి. మీరు ఒక తల్లికి పుట్టలేదా.? మీరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అని నేను అర్ధం చేసుకోగలను.. కానీ, కొంచెం మాట్లాడే పద్దతి నేర్చుకోండి. నేను ఇలాంటి మెసేజ్ లను చాలా ఇగ్నోర్ చేస్తాను. కానీ, కొంతమంది అబ్బా యిలు.. హద్దుదాటి చాలా కఠినం గా మాట్లాడుతున్నారు” అంటూ ఘాటుగా స్వాందించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది .
