సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 8 ఏళ్లుగా సరైన హిట్ సినిమా పడని పవన్ కళ్యాణ్‌ కు ..ఆయన క్రేజ్ కు అభిమానుల అంచనాలను అందుకొనే భారీ బడ్జెట్ సినిమా పడితే ఎలా ఉంటుందో అని ఆత్రంగా ఎదురుచూస్తున్నా జనసేన కార్యకర్తలంతా గ్యాంగ్ స్టర్ డ్రామా ‘ఓజీ‘ (OG Movie) మీదనే భారీ ఆశలు పెట్టుకున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా నేడు, గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యంగ్ డైరెక్టర్ సుజీత్ తో డీవీవీ దానయ్య నిర్మించిన ‘ఓజీ’ సినిమా కధ విషయానికి వస్తే.. జపాన్ దేశానికీ చెందిన 2 గ్యాంగ్ లకు చెందినదిగా ప్రారంభమయి ముంబై చేరుకొంటుంది. …ఓజెస్ గంభీర (పవన్ కళ్యాణ్‌) జపాన్ లో ఓ దాడి నుండి తప్పించుకుని యుక్తవయసులో ఇండియాకు వచ్చే ప్రయత్నంలో సత్యా దాదా (ప్రకాశ్ రాజ్)పై అటాక్ జరిగితే… ఓజీ రక్షిస్తాడు. దాంతో సత్యదాదా ఓజీని తనతో పాటు ముంబై తీసుకెళ్ళిపోతాడు. అక్కడ అండర్ వరల్డ్ డాన్ గా సత్యాదాదా పేరు తెచ్చుకుంటాడు. ఇద్దరు కొడుకులున్న సత్య దాదా ఓజీని తన మూడో కొడుకుగా భావిస్తుంటాడు. అయితే అనుకోని అవాంతరం కారణంగా సత్య దాదా కుటుంబాన్ని వీడి ఓజీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ డాక్టర్ కన్మణి (ప్రియాంక అరుల్ మోహన్) ని పెళ్ళి చేసుకుంటాడు. ఎప్పుడైతే ఓజీ ముంబైని విడిచి వెళ్ళిపోతాడో అప్పుడు సత్యాదాదా ఒకప్పటి స్నేహితుడైన పొలిటీషియన్ మిరాజ్ కర్ (తేజ్ సప్రూ) కొడుకులు జిమ్మీ (సుదేవ్ నాయర్), ఓమీ (ఇమ్రాన్ హష్మీ) అండర్ వరల్డ్ పై పట్టు బిగించే ప్రయత్నం చేస్తారు. ఈ సమయంలో కొడుకులిద్దరినీ పోగొట్టుకున్న సత్యా దాదా కోసం ఓజీ తిరిగి ముంబైకి వచ్చాడా? అన్నది మిగతా కథ.. ఇక సినిమా ను దర్శకుడు సుజీత్ తన స్లైలిష్ ఫ్యాషన్ టేకింగ్ తో తీసాడు. పవన్ ను అభిమానులు ఎలా చూడాలనుకొంటారో.. ఆ ఆకలిని తీర్చేసేలా ఎలివేషన్స్ అద్భుతంగ తీసాడు. హీరో, విలన్ తో పాటు ఇతర పాత్రలకు సుజీత్ ఇచ్చిన ఎలివేషన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఓజి అజ్ఞాతంలో గడిపిన జీవితం, భార్యతో అనుబంధం, కూతురు కోసం పరితపించే సన్నివేశాలు ఆడియెన్స్ ను ఆకట్టుకుంటాయి. నాన్ చాక్ తో పవన్ కళ్యాణ్‌ చేసే ఫస్ట్ ఫైట్, అలానే క్లయిమాక్స్ లో చేతిలోకి తీసుకునే ఆయుధానికి ‘జానీ’ పేరు పెట్టడం బాగుంది. అయితే అన్ని వర్గాలను సినిమా అలరించే అవకాశం లేదు. హీరో పవన్ స్టూడియో లలో ఎక్కువ సన్నివేశాలు ఉండటం ఒక లోటు. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ సాగే రక్తపాతం మాత్రం ప్యామిలీ ఆడియన్స్ కు ఇబ్బందే. ఇమ్రాన్ హష్మీ స్క్రీన్ ప్రెజెన్స్, శ్రేయ రెడ్డి, అర్జున్ దాస్ నటన వాయిస్ బాగుంది. తేజ్ సప్రూ ప్రధాన ప్రతినాయకుడిగా యాక్ట్ చేశారు. ప్రియాంక మెరుగైన నటన ప్రదర్శించింది. ఇతర ప్రధాన పాత్రలను సుదేవ్ నాయర్, అభిమన్యుసింగ్, ‘కిక్’ శ్యామ్, శుభలేఖ సుధాకర్ తదితరులు పోషించారు. ప్రభాస్ ‘సాహో’ సినిమాను లింక్ చేస్తూ జాకీష్రాఫ్‌ ఒకే ఒక్క సీన్ లో మెరిశాడు. ఇక సంగీత దర్శకుడు తమన్ తన సంగీతంతో చేసిన మాయాజాలం అభిమానులను ఊపేస్తోంది. మనోజ్ పరమహంస బెస్ట్ సినిమాటోగ్రఫీ అందించారు. మొత్తానికి యాక్షన్ సినిమా ప్రియులకు ఓజి మంచి కానుక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *