సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఆంధ్ర ప్రదేశ్ లో విభజన ముందు విభజన తరువాత కూడాభీమవరం నియోజకవర్గంలో ఏ రాజకీయ పార్టీ గెలుస్తుందో అదే రాజకీయ పార్టీ లేటా కూటమి ఏపీలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్గుర్తించే పవన్ కళ్యాణ్ జనసేన తరపున మొదటిసారి భీమవరం మరియు గాజువాక లో పోటీ చేసారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ తమిళనాడులో సినీ హీరో విజయ్ పాటిస్తున్నారు. తిరుచ్చి ఈస్ట్‌లో గెలిచిన పార్టీ తమిళనాడు లో అధికారంలోకి వస్తుందంటే సెంటిమెంట్ బలంగా ఉంది. ప్రముఖ నటుడు విజయ్ పార్టీ కొత్త పార్టీ టీవీకే బరిలో నిలవడంతో.. ఈసారి రసవత్తర తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి తాను పోటీ చేస్తున్నట్లు టీవీకే అధినేత విజయ్ ప్రకటించారు. చెన్నై శివార్లలోని పెరంబూరుతోపాటు మధ్య తమిళనాడులోని తిరుచ్చి ఈస్ట్ నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. మరో పోలిక ఏమిటంటే .. భీమవరంలో కాపు ఓటర్లు ఎక్కువ కాగా తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గంలో క్రిస్టియన్ మైనార్టీ ఓటర్లు, అధిక సంఖ్యలో ఉన్నారు. ఆ విషయంలో కూడా విజయ్ పవన్ ను పాలో అయ్యారు. మరి భీమవరం ఫలితం విజయ్ కు రాకూడదని కోరుకొందాం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *