సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ అభిమానులు పవన్ కళ్యాణ్ ను క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తున్నారు. ఆధునిక తెలుగు సినిమా సత్తా మొదటిసారిగా ప్రపంచానికి చాటిన ఘనుడు, తెలుగు సినిమా చరిత్రలో మహా మంచి మనిషిగా పేరున్న సూపర్ స్టార్ కృష్ణ తాను మెచ్చిన అభిమాన నటుడు ఎన్టీఆర్ TDPప్రభంజనం లో కూడా తాను మెచ్చిన కాంగ్రెస్ పార్టీ ని తన చరిష్మా తో రాష్ట్ర వ్యాప్తంగా అనేక బహిరంగ సభలలో పాల్గొని పార్టీని బలోపేతం చేసి ఏలూరు ఎంపీ గా కూడా గెల్చి కొత్త చరిత్ర సృష్టించడం అందరికి తెలిసిందే.. అయితే ఇటీవల బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కృష్ణ గారు కాంగ్రెస్ లో ఉండి ఎన్టీఆర్ గారిని విమర్శించినా ఏరోజు ఎన్.టి. రామారావుగారు కృష్ణగారిని ఒక్కమాట కూడా అనలేదు, అది ఎన్టీఆర్ సంస్కారం అని చెప్పారు. అది తెలుగు దేశం సంస్కృతీ అని చెప్పడం తో కృష్ణ అభిమానులు ఖంగు తిన్నారు. దీనిపై పలు వీడియోలులో నిరసన తెలుపుతున్నారు. దీనిపై విజయ నిర్మల తనయుడు సీనియర్ నరేష్ తాజాగా స్వాందిస్తూ .. పవన్ కళ్యాణ్ ఇలా కృష్ణ గురించి మాట్లాడిన మాటలు విని షాక్ అయ్యాను. అని ఒక పోస్ట్ పెడుతూ కృష్ణ గారు బంగారు హృదయం గల మనిషని, అటు సినిమా, ఇటు రాజకీయాలలో సాహసోపేతంగా అయన చేసిన కృషి మరువలేనిదని చెప్పారు నరేష్.. పవన్ కళ్యాణ్ ప్రసంగం వీడియో, నరేష్ తన ‘ఎక్స్’ లో షేర్ చేస్తూ, కృష్ణ గారు ఎన్టీఆర్ గురించి మాట్లడిన వీడియోని కూడా షేర్ చేశారు . కృష్ణ తన అభిమాన నటుడు ఎన్టీఆర్ అని, ఎన్టీఆర్ ని చూడటానికే అప్పట్లో మద్రాస్ వెళ్లానని, అతన్ని కలిశానని, అతని సినిమాలో వేషం ఇవ్వమని అడిగితే ‘నువ్వు ఇంకా చిన్న కుర్రాడిలా వున్నావు’ తరువాత రా అని చెప్పారని, రాజకీయాలు వేరు .. అంటూ కృష్ణ గారు ఆ వీడియోలో ఎన్టీఆర్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. కృష్ణ గారు ఎప్పుడూ తన పొత్తులు మార్చుకోలేదు, అలాగే ఎప్పుడూ ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదు అని నరేష్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ అంటే తనకి గౌరవం ఉందని, కానీ భవిష్యత్తులో ఇటువంటి మాటలు కృష్ణ గారి గురించి మాట్లాడకుండా ఉంటే మంచిది అని అతనికి విజ్ఞపి చేస్తున్నాను, అని నరేష్ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *