సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవర్ స్టార్ పవన్ కల్యా ణ్ ఆయన అభిమానులకోసం కొత్తగా ఈ జులై 4న సోషల్ మీడియాలో ఇన్ స్ట్రా ఖాతాలోకి లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో నేడు, ఆదివారం తాజాగా తొలి పోస్ట్ పెట్టారు. ఆయన పోస్ట్ చేసిన ప్రత్యే క వీడియో ప్రస్తుతం వైరలవుతోం ది. ‘ఎలుగెత్తు, ఎదురించు, ఎన్ను కో .. జై హింద్!‘ అనే స్లోగన్ ను ఇన్ స్ట్రా లో పెట్టారు. అంతేకాదు ఆయన తొలి పోస్ట్ లో రాజకీయాలకు సంబంధించి కాకుండా ఆయన సినిమా కెరీర్కు సంబంధించి సినిమా షూట్ లు, చిరంజీవి,అమితాబ్ బచ్చన్, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ , జూ ఎన్టీఆర్ తో కల్సిన సన్నివేసాలుతో ఓ ప్రత్యేక వీడియోను షేర్ చేశారు. ‘‘చలనచిత్ర పరిశ్రమలో భాగమై ఎంతోమంది ప్రతిభావంతులతో, నిరాడంబరమైన వ్యక్తులతో కలిసి ప్రయాణిస్తున్నందుకు కృతజ్ఞతతో ఉన్నాను’’ అని ఆ వీడియో ప్రారంభమైంది. దీనికి ‘‘మన బంధం ఇలాగే కొనసాగాలని, ఎన్నో మధురమైన జ్ఞాపకాలను పంచుకోవాలని ఆశిస్తూ..’’అని వారితో తన సంఘీభావాన్ని జోడించారు. ఇటీవల గోదావరి జిల్లాలలో జనసేన వారాహి సభలలోహీరోలు ప్రభాస్ మహేష్ బాబు లు తనకంటే పెద్ద హీరోలు అని వారంటే తనకు కూడా ఇష్టమని చాపక్రింద నీరులా అందరి హీరోల అభిమానుల మద్దతూ కూడగట్టుతు.. ఎక్కడ తగ్గాలో తనకు తెలుసునంటు పావులు కదుపుతున్నారు పవన్ కళ్యాణ్..
