సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు విశాఖ పోలీసులు నోటీసులు అందజేశారు. 41A కింద పవన్ కళ్యాణ్ కు ఏసీపీ హర్షిత నోటీసులు ఇచ్చారు. కాగా, నోటీసుల్లో.. ఈనెలఖారు వరకు పోలీసు యాక్ట్ 30 అమలులో ఉంది. విశాఖలో సభలు, ర్యాలీలు, రోడ్ షో లకు అనుమతి లేదు. నిబం ధనలను ఉల్లంఘించి గత రాత్రి ర్యాలీ చేసినందుకు పవన్ కల్యాణ్ కు నోటీసులు ఇచ్చినట్టు పోలీసులు పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ సాయంత్రం 4 గంటల లోగ విశాఖను వీడాలని లేకపోతె పోలీస్ చర్యలు ఉంటాయని నోటీసులో ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *