సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పవర్ స్టార్ పవన్ కల్యా ణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అగ్రనిర్మాత ఎ.ఎం .రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకం పై ఎ.దయాకర్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చారిత్మాక నేపథ్యంలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో విలన్ చాయాలు ఉన్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో ఒక నాటి బాలీవుడ్ స్టార్ హీరో బాబిడియోల్ నటిస్తున్నారు. ఒకనాడు గుప్తూ .. సోల్ జర్ సినిమాలతో హిందీ సినిమాల బాక్స్ ఆఫీస్ను షేక్ ఆడించిన ధర్మేంద్ర తనయుడు బాబీ డియోల్ చాల కాలం విరామం తరువాత పవన్ కళ్యాణ్ తో కలసి నటిస్తుండటం విశేషం. సినిమా చిత్రీకరణలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చా రు. తోట తరణి 17వ శతాబ్దానికి చెందిన భారీ దర్బార్ సెట్ ను రూపొందించారు. పవన్ కళ్యాణ్, బాబీ డియోల్ మధ్య వచ్చే కీలక సన్నివేశాలను ఈ దర్బార్ సెట్ లో చిత్రీకరించనున్నారు. బాబీ డియోల్ కి ఘన స్వాగతం పలుకుతూ హరి హర వీర మల్లు బృందం ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *