సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యా ణ్ ఇంటి ముందు ఎవరో ఆగంతకులు రెక్కీ నిర్వహించారని, ఆధారాలు ఉన్నాయని, పవన్ హత్య కు 250 కోట్ల డీల్ కుదిరిందని ఇటీవల ఒక వర్గం మీడియా ప్రకటించిన నేపథ్యంలో , జనసేన పార్టీ నేతలు కూడా పవన్ కళ్యాణ్ కు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్ననేపథ్యంలో తెలంగాణా కు చెందిన జూబ్లీ హిల్స్ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు పూర్తీ చేసి.. పవన్ ఇంటిముందు రెక్కీ నిర్వహించిన కేసులో కీలక విషయాలు మీడియా కు వెల్లడిస్తూ.. .పవన్ కళ్యాణ్ ఫై ఎలాంటి రెక్కీ గానీ, దాడికి కుట్రగానీ లేదని , రెక్కీ గ్యాంగ్ గ భావిస్తున్న ఆదిత్య విజయ్, వినోద్, సాయికృ ష్ణ అనే యువకులు న్యూ సెన్స్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. అయితే, వీరంతా అక్కడ సమీపములోని పబ్‌కు వెళ్లి తప్ప తాగి తిరిగివస్తూ పవన్ ఇం టి ముందు కారు ఆపారు. ఈ క్రమంలో కారు తీయాలని చెప్పిన పవన్ సెక్యూరిటీ సిబ్బంది తో యువకులు గొడవపడినట్టు తెలిపారు. ఇక, జూబ్లీహిల్స్ పోలీసులు.. ముగ్గురు యువకులను విచారించి నోటీసులు ఇచ్చినట్టు స్పష్టం చేశారు. తాగిన మైకంలోనే న్యూసెన్స్ చేసినట్టు యువకులు అంగీకరించారని పోలీసులు పేర్కొ న్నా రు. కాగా, పవన్ ఇంటి ముందు ఆపిన కారుకు గుజరాత్ రిజిస్ట్రేషన్ ఉందని అది సాయికృష్ణకు చెందిన కారుగా పోలీసులు ప్రకటించారు.
