సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల సీఎం చంద్రబాబు అన్యమతం పుచ్చుకొన్న ఎంతటివారైనా సరే ..డిక్లరేషన్ ఇచ్చి శ్రీవారి దర్శనం చేసుకోవలసిందే అని ప్రకటించిన నేపథ్యంలో .. తిరుమలలో ఆసక్తి కర ఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 11 రోజుల క్రితం తను తలపెట్టిన ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే మంగళవారం రాత్రి కాలినడకన తిరుమలకు చేరుకున్న పవన్ రాత్రి అక్కడే బస చేశారు. లడ్డు కేసు సుప్రీంకోర్ట్ విచారణ లో ఉన్న నేపథ్యంలో ఎటువంటి కామెంట్స్ చెయ్యనని అన్నారు. నేడు, బుధవారం స్వామి వారి దర్శనం నేపథ్యంలో తన ఇద్దరు కూతుర్లతో కలిసి పవన్ స్వామి వారిని దర్శించుకున్నారు. అయితే ప్రస్తుత భార్య, పిల్లలు స్వహతగా క్రైస్తవులు కావడం అందరికి తెలిసిందే.. కొంతకాలం క్రితం పవన్ కూడా జెరూసలేమ్ లో బాప్టిజం తీసుకున్నానని ప్రకటించారు. అయితే అయన ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. అయితే శ్రీవారి దర్శనం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె పలీనా కొణిదెలను మొదటిసారి మీడియా ముందుకు తీసుకురావడమే కాక శ్రీవారి దర్శనం కోసం డిక్లరేషన్ ఇప్పించారు. డిక్లరేషన్ పత్రాలపై కుమార్తె ‘పలీనా’తో సంతకాలు చేయించారు. అయితే పలీనా మైనర్ అయినందున తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు.ఇదిలాఉండగా పవన్ కల్యాణ్ పెద్ద కూతురు ఆధ్య, కూడా శ్రీవారి దర్శనం చేసుకొన్నారు.
