సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన ‘కాల దేవుడి’ పాత్రలో .. ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బ్రో’… సముద్రఖని దర్శకుడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందించి, సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం వహించడంతో ఈ ఫాంటసీ సినిమా భారీ అంచనాల మధ్య గత నెలలో విడుదలయింది. అయితే ప్రేక్షకుల అభిమానుల అంచనాలు అందుకోకపోవడం తో ఫలితం నిరాశను మిగిల్చింది. అయితే పవన్ కొత్త సినిమా ను ఒటిటి లో మిస్ కాకుండా చూడాలని ఎవరికీ ఉండదు చెప్పండి.. వారికీ శుభవార్త! బ్రో సినిమా చాల స్వల్ప వ్యవధిలోనే ఓటీటీ విడుదలకు రంగం సిద్ధమైంది. నెట్ ఫ్లిక్స్ వేదికగా వచ్చే శుక్రవారం ఆగస్టు 25 నుంచి ఓటిటి లో బ్రో ను వీక్షించవచ్చు
