సిగ్మాతెలుగు డాట్, ఇన్, న్యూస్: ఈ నెలలో గోదావరి జిల్లాలలో అన్నవరం నుండి భీమవరం వరకు జరిగే పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు సంబందించి ముఖ్యంగా నరసాపురం, పాలకొల్లు, భీమవరం లో యాత్రకు చెయ్యవలసిన ఏర్పాట్లు మరియు తదితర ముఖ్య విషయాలపై భీమవరం జనసేన పార్టీ ఆఫీస్ లో పశ్చిమ గోదావరి జిల్లా నియోజకవర్గాల ఇంఛార్జిలు,PAC సభ్యులతో జిల్లా అధ్యక్షులు, కొటికలపూడి గోవిందరావు సమావేశం నిర్వహించి వారి వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకొన్నారు. ఈ మొదటి విడుత యాత్ర భీమవరం లో ముగుస్తున్న నేపథ్యంలో భీమవరంలో పవన్ కళ్యాణ్ 3 రోజులు పాటు విడిది చేసి జిల్లా నాయకులతో సమీక్షలు జరుపనున్న దృష్ట్యా నేటి జిల్లా పార్టీ సమావేశం చాల కీలకమైనది. ఈ కార్యక్రమంలో జిల్లా నేతలు బొలిశెట్టి శ్రీనివాస్, కనకరాజు సూరి, పత్సమట్ల ధర్మరాజు, విడివాడ రామచంద్ర రావు , చేగొండి సూర్య ప్రకాష్, రెడ్డి అప్పలనాయుడు, మేక ఈశ్వరయ్య, ,రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి, మల్లినీడి తిరుమలరావు, కరాటం సాయి, చెనమల్ల చంద్రశేఖర్, బండి రమేష్ కుమార్ ,తదితరులు పాల్గొన్నారు.
