సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి బుధవారం సాయంత్రం పెడనలో జరిగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా పెడనలో వారాహి యాత్రలో తనపై దాడి జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో..బహిరంగ సభ జరుగుతుందా? పోలీస్ అనుమతి వస్తుందా? అన్న చర్చ సాగుతోంది. గత మంగళవారం మచిలీపట్నంలో జరిగిన జనవాణి కార్యక్రమంలో పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెడనలో జరిగే తన సభలో రాళ్లు, కత్తులతో దాడి చేసే అవకాశం ఉందని, 2 వేల మంది గూండాలను, క్రిమినల్స్‌ను పబ్లిక్ మీటింగ్‌లోకి దింపి అల్లర్లు సృష్టించాలని వైసిపి వాళ్ళు కుట్ర చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అక్కడ జనసైనికులు సమన్వయంతో ఎదురు దాడి చెయ్యకుండా కత్తులు, కటార్లు తెచ్చేవారిని చేతులు కాళ్ళు కట్టేసి పోలీసులకు అప్పగించాలని సూచించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా ఆదేశాల మేరకు పోలీసులు పవన్‌కల్యాణ్‌కు నోటీసులు జారీ చేశారు. మీకు ఎవరు సమాచారం అందించారు. మేము కోరిన ..మీ ఆరోపణలకు మీరు ఆధారాలు ఇప్పటివరకు ఇవ్వలేదు.. ఎందుకు ఇటువంటి ఆధారాలు లేని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు? పవన్‌కల్యాణ్ సమాధానం చెప్పాలని .. మా పోలీస్ నిఘా సమాచారం మాకు ఉంటుంది. ప్రజలు భయభ్రాంతులు చేసే రెచ్చగొట్టే మాటలు, సైగలు పవన్ కళ్యాణ్ మానుకోవాలని ఎస్పీ జాషువా హెచ్చరించారు.
