సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల మన్యం పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాలొన్న కార్యక్రమాలలో అత్యంత సన్నిహితంగా తిరిగిన ఐ పి ఎస్ అధికారి ఫేక్ అని తేలడంతో అందరు షాక్ తిన్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపం బయటపడటంతో చాల ఆలస్యంగా గుర్తించిన అధికారులు అతడిని తాజగా అదుపులోకి తీసుకున్నారు.వివరాలలోకి వెళితే, విజయనగరం జిల్లా ముడిదాం ప్రాంతానికి చెందిన సూర్య ప్రకాష్ గత ఏడాదే ఐపీఎస్ కు సెలక్ట్ అయ్యానని స్థానికులకు చెప్పాడు. ట్రైనింగ్ లో ఉన్న తాను ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పర్యటన కోసం వచ్చానని చెప్పుకున్నాడు. ఐపిఎస్ అధికారి డ్రస్ లో పవన్ పర్యటనలో పాల్గొన్నాడు.. పవన్ పర్యటనలో అతడి కదలికలపై అనుమానం రావడంతో పోలీసులకు చిక్కకుండా విజయనగరం పారిపోయాడు.. అక్కడ నుంచి కారులో హైదరాబాద్ వెళుతుండగా విజయనగరం సరిహద్దులో పోలీసులు తాజగా అదుపులోకి తీసుకున్నారు. ఇక, సూర్య ప్రకాష్ గతంలో పార్వతీపురం డివిజన్ తూనుకలు కొలతలు విభాగంలో లైసెన్స్డ్ రిపేరర్ గా పని చేశాడు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వై కేటగిరీ భద్రతలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రతలో జరుగుతున్న లోపాలను దర్యాప్తు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి ప్రకటించారు.
