సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత రాత్రి కత్తిపూడి బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు, ఆరోపణలపై నేడు, గురువారం మాజీ మంత్రి పేర్నినాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎవరు ఊహించని రీతిలో తన 2 చెప్పులు చూపించారు. గతంలో పవన్ తాను జగన్ సర్కార్ లో వైసీపీ నేతలను చెప్పు చూపించి హెచ్చరించానని పెద్ద మగాడిలా ప్రచారం చేసుకొంటున్నాడని.. మాకు 2 చెప్పులున్నాయి ..అని చూపిస్తూ.. మీ కన్నా మొనగాడిని .. మీలాగా సినిమా డైలాగ్స్ అనుకుంటున్నావా? .. మక్కెలు ఇరగదీసి పారేస్తాం అని హెచ్చరించారు. తమరి ఆఫీసులో కూర్చుని సొల్లు మాటలు తో అక్కడ చేరినవారిని రెచ్చగొట్టం కాదు.. సినిమా వేశాలు కట్టిపెట్టండి అని అన్నారు. పవన్ చేస్తున్నది వారాహి యాత్ర కాదని.. ‘నారా’హి యాత్ర ని విమర్శించారు. పదేళ్లుగా పవన్ పార్టీని నడుపుతున్నది చంద్రబాబేనని ఆరోపించారు. మా కాపులు ఎక్కువ ఉండే తూగో జిల్లా లోనే జగన్ కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేనని చెప్పిన కూడా ఓట్లు వేశారని పవన్ నిన్న బహిరంగ సభలో అక్కడి కాపులను రెచ్చగొడుతు కుల రాజకీయాలు చేస్తున్నాడని.. పవన్ కు ప్రజలను నమ్ముకుంటే అసెంబ్లీలో సీట్లు వస్తాయని, అంతే కానీ నాకు ప్యూహాలు ఉన్నాయి.. పొత్తులతో వస్తాను. అంటే ఎప్పటికి అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అన్నారు. సీఎం పదవి ఏమైనా దానమా?..15 సీట్లకు పోటీచేసి సీఎం అయిపోతావా? చంద్రబాబు సీఎం పదవి నీకు ఇస్తే సీఎం అయిపోతావా? ప్రజలు సీఎంని చెయ్యాలి కానీ ఇదేమిటి? అని పేర్ని నాని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలంగాణ నేతలు ఆంధ్ర .. కొడకల్లారా ! అంటే బాధేసిందని, ఎవరు ఎదుర్కొరా? అని పవన్ అంటున్నారు. మరి మొన్న మంత్రి హరీష్ రావు ఆంధ్ర వారిని, మంత్రులను విమర్శిస్తూ ఉంటె మేము ఎదుర్కొంటే .. పవన్ తెలంగాణ తరుపున , హరీష్ తరపున రంగంలోకి దిగిపోయి వైసిపి మంత్రులను ను విమర్శించారని .. హైదరాబాద్ లో నివాసం ,ఓటు హక్కు, వ్యాపారాలు ఉన్న పవన్ సీఎం కెసిఆర్ చంక నా .. తన అవసరాలకు వారిని అనుమతులు అడుక్కొంటాడని అందరికి తెలుసునని తీవ్ర స్థాయి లో విమర్శించారు పేర్ని నాని..
