సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నికల పోలింగ్ జరిగింది. సీఎం జగన్ తన కుటుంబంతో సరిగా గడపడానికి లండన్ వెళ్లారు. చంద్రబాబు దంపతులు ప్రశాంతంగా అమెరికా వెళ్లారు. రాష్ట్రంలో చాల మంది నేతలు కొద్దీ రోజులు దేశవిదేశాలలో గడపడానికి వెళుతున్నారు. మరి జనసేన అధినేత పవన్‌కల్యా ణ్ ఎక్కడ ఉన్నారు.? ఇప్పుడిదే చర్చ నీయాంశమైంది. పిఠాపురం లో పోటీ చేసిన పవన్‌కల్యాణ్ ఈ దఫా ఎట్టి పరిస్థితులలో చట్టసభలో అడుగు పెడతాననే ధీమాతో ఉన్నారు. వారణాసిలో మోడీని కలిశారు. టీడీపీ వర్మ కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విచిత్రంగా ఆయన ఎక్కడా కనిపించడం లేదు. అలాగే ఎన్నికల ఫలితాలపై కూటమి విజయం ఫై ఎలాంటి ప్రకటన చెయ్యక పోవడం , మరో ప్రక్క చంద్రబాబు లోకేశ్ కూడా ఎన్నికల ఫలితాలపై ధీమాగా స్వాదించక పోవడం గమనార్హం. పవన్ ప్రస్తుతం సినిమా షూటింగ్ లలో కూడా పాల్గొనడం లేదు. అయితే అధికారికంగా ప్రకటించలేదు కానీ కొందరేమో అత్తారింటి దేశం రష్యా కు వెళ్లారని ప్రచారం చేస్తున్నారు. జనసేన అగ్ర నాయకుడు నాదెండ్ల మనోహర్ ఎలాంటి ప్రకటన చెయ్యలేదు. మరి వాస్తవం ఏమిటో కానీ జూన్ నెల 4న ఓట్ల లెక్కింపు కు వారం రోజులు ముందు అటు జగన్ ఇటు చంద్రబాబు తో పాటు పవన్ బయటకు వస్తారేమో? మా వైసీపీ సాధించే విజయం ఎలా ఉంటుందంటే దేశం మొత్తం ఆంధ్ర వైపు చూస్తుంది అంటూ సీఎం జగన్ సంచలన ప్రకటన చేసి లండన్ వెళ్ళిపోతే.. కూటమి దే విజయం అంటూ వారి అభిమానులు మాత్రం బెట్టింగులు కడుతున్నారు.ఎదో తేడాగా ఉందే అంటూ..వీరి పార్టీల క్యాడర్ అభిమానులు మాత్రం రోజుకో సర్వే లెక్కలపై గెలుపు ఎవరిదీ? అంటూ బుర్రలు బ్రద్దలు కొట్టుకొంటున్నారు మరి..
