సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కోనసీమ లో పచ్చని కొబ్బరి చెట్లకు తెలంగాణ వారి దిష్టి తగిలింది , అంటూ పలు వ్యాఖ్యలు చేసిన ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫై తెలంగాణ నేతలు రాజకీయ పార్టీలకు అతీతంగా భగ్గుమంటున్నారు. బిఆర్ ఎస్ లో నేతలు, కాంగ్రెస్ మంత్రులు నేతలు ఇటీవల పెద్ద ఎత్తున పవన్ ను విమర్శించారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. కోనసీమ లోని పిఠాపురంలో ప్రజలు గెలిపిస్తే వారిని వదిలేసి.. పొద్దున్న లెగిస్తే హైదరాబాద్ లో ఉంటావు.. నీ దిష్టి తెలంగాణకు తగలాలి కానీ మా దిష్టి కోనసీమకు తగలటం ఏమిటి ? నిన్ను గెలిపించాకే కోనసీమ వారు దిష్టి కొట్టుకొనిపోయారు అంటూ ఆగ్రహం వక్తం చెయ్యగా, తాజగా నేడు, మంగళవారం తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం కాగానే ఆయన నోటికి వచ్చినట్లు ఏదేదో మాట్లాడుతున్నారని .. ఇటీవల కోనసీమలో అన్న మాటలకూ తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసారు. ఇక్కడ ఉంటూ ఇక్కడ సినిమాలలో నటిస్తూ .. నరుడి దిష్టికి నల్లరాయి బ్రద్దలు అవుతుందని ఇక్కడివారినే ని ఇష్టం వచ్చినట్లు అవమానకరంగా మాట్లాడతావా? పవన్ క్షమాపణ చెబితే.. తెలంగాణలో ఆయన సినిమా ‘ఒకటి, రెండు రోజులు’ ఆడుతుందన్నారు. లేకుంటే సినిమాలు అసలు ఆడవని మంత్రి కోమటిరెడ్డి హెచ్చరించారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *