సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ మంత్రి పేర్ని నాని నేడు, శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ మత్య్స కారులకు పంచిన డబ్బు కంటే ఆయన వచ్చి వెళ్లిన విమానం ఖర్చే ఎక్కువ. పవన్ తన దగ్గర డబ్బులులేవని చెబుతాడు కానీ ఆయన వద్ద చాలా డబ్బులున్నాయి. పవన్ దగ్గర డబ్బులు లేకుంటే చార్టెడ్ ఫ్లైట్‌లో ఎలా వస్తాడు? తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కూడా సీఎం జగన్ పై విషం చిమ్మడం పవన్‌కు అలవాటుగా మారింది. ఏపీ ప్రజలకు మతిమరుపు చాలా ఎక్కువ అని పవన్ అనుకుంటున్నాడు. మత్స్య కారులకు సీఎం జగన్ ఏమీ చేయడం లేదని అన్నాడు.. సీఎం జగన్ వచ్చాకే కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తూ.. శరవేగంగా పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో ఉండే పవన్ నిద్ర లేచి విశాఖ ఊపుకొంటూ వచ్చేసరికే ప్రమాదంలో నష్టపోయిన మత్స్యకారులకు సీఎం జగన్ ప్రభుత్వం రూ.7కోట్ల 11లక్షల పరిహారం ఇచ్చింది. పవన్ మాటలన్నీ పచ్చి దగాకోరు మాటలు. పవన్ వచ్చి మత్స్యకారులకు రూ.50వేలు ఇచ్చి రూ.50కోట్లు ఇచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నాడు. పవన్ కల్యాణ్‌కు ఛాలెంజ్ చేస్తున్నా . 2014 నుంచి 2019 వరకు నువ్వు, చంద్రబాబు కలిసి ఒక్క ఫిషింగ్ హర్బర్ అయినా కట్టారా? చంద్రబాబు, పవన్, కాపులను ఏనాడైనా మనుషుల్లాగా చూసారా ? కాపులను పెట్టుబడిగా, ఆస్తిగా, టోకుగా చంద్రబాబుకు బేరంపెట్టడానికే పవన్ చూస్తున్నాడు.చంద్రబాబును అధికారంలో చూడాలనే ఆకాంక్షతోనే పవన్ పనిచేస్తున్నాడు. అని విమర్శించారు.
