సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని (Pawan Kalyan) ద్వారకాతిరుమల మండలం ఐ ఎస్. జగన్నాథపురం లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకునేందుకు నేటి సోమవారం ఉదయం ఆయన హైదరాబాద్ నుండి ముందుగా రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కు ప్రత్యక విమానంలో చేరుకొన్నారు. అయితే అక్కడ ఆయనను కలిసేందుకు వచ్చిన రాజానగరం టీడీపీ నేతల 2 వర్గాల మధ్య ఏర్పడిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొట్టుకొనే స్థాయికి వెళ్ళింది. ఎయిర్‌పోర్టులోకి రాజానగర్ టీడీపీ ఇన్‌ఛార్జి బొడ్డు వెంకటరమణను అనుమతించక పోవడంపై పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే సీఎం ప్రోగ్రాం కమిటీ సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్‌ను, వారి వర్గాన్నిఎలా అనుమతించారంటూ? పోలీసులతో బొడ్డు వర్గం గొడవకు దిగింది. వాళ్లకు ప్రోటోకాల్ ఉందా? అని ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాలు పరస్పరం వాగ్విదానికి దిగాయి. బూతులు తిట్టుకోవడమే కాకుండా కొట్టుకునే స్థాయికి రెండు వర్గాల నేతలు వెళ్లారు. వెంటనే పోలీసులు వారి గ్రూపులను విడదీయడంతో పరిస్థితి సర్దుమణిగింది.
