సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన పార్టీ పోటీ చేస్తున్న 21 స్థానాలలో గెలుపు కోసం ఇతర కూటమి స్థానాలలో అభ్యర్థుల విజయం కోసం అధినేత పవన్ పర్యటనలు జరుపుతుంటే పవన్ స్వయంగా పోటీచేస్తున్న పిఠాపురంలో అయన గెలుపు కోసం మెగా ఫ్యామిలీ నుండి,నాగబాబు,దంపతులు, హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ , జబర్దస్త్ టీమ్ నుండి, గబ్బర్ సింగ్ టీమ్ నుండి నటులు కుటుంబసభ్యులు ఇంటిటా ప్రచారం చేస్తూ.. ఎట్టి పరిస్థితులలో గత భీమవరం గాజువాక లలో పరిస్థితులు పునరావృత్తం కాకుండా చూడాలని పవన్ గెలుపు కోసం కష్టపడుండగా.. ఇక మెగా స్టార్ చిరంజీవి కూడా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గొప్పతనాన్ని వివరిస్తూ తాజగా వీడియో రిలీజ్ చేశారు. చిరంజీవి పిఠాపురం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. అమ్మ కడుపులో ఆఖరివాడిగా పుట్టినా.. అందరికీ మంచి చేయాలి.. మేలు జరగాలి అనే విషయంలో ముందువాడిగా పవన్ కళ్యాణ్ ఉంటాడని చిరంజీవి తెలిపారు. తనకంటే జనం గురించి ఎక్కువుగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడి కళ్యాణ్‌బాబుది అంటూ చెప్పారు. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారని.. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టారన్నారు. సరిహద్దుల దగ్గర ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడే జవాన్ల కోసం పెద్ద మొత్తంలో పవన్ కళ్యాణ్ చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనానికి కావాల్సింది అనిపిస్తుందని వీడియో చిరంజీవి తెలిపారు. ఒక రకంగా చెప్పాంలటే సినిమాల్లోకి బలవంతంగా వచ్చాడని.. రాజకీయాల్లోకి ఇష్టంతో మాత్రమే వచ్చాడన్నారు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుందని, అలాగు ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుందన్నారు. కొడుకు కోసం బాధపడుతున్న తన తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పానని, నీ కొడుకు ఎంతో మంది తల్లులకోసం, వాళ్ల బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధమని తెలిపానన్నారు. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్లతోనే ప్రజాస్వామ్యానికి మరింత నష్టమని.. జనం కోసం పవన్ జనసైనికుడు అయ్యాడన్నారు. ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలంటే చట్టసభల్లో ఆయన గొంతు ఉండాలన్నారు. జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు కళ్యాణ్‌ను గెలిపించాలన్నారు. మీకు సేవకుడిగా సైనికుడిగా అండగా నిలబడతాడని, మీకోసం అవసరమైతే కలబడతాడని, మీకల నిజం చేస్తాడని గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి పవన్ కళ్యాణ్ ను గెలిపించాలంటూ వీడియోను చిరంజీవి ముగించారు.
