సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను చంపేస్తామని హెచ్చరిస్తూ ఆయన పేషీకి గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్, అభ్యంతరకర భాషతో సందేశాలు రావడంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యి దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుడిని గుర్తించారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నూక మల్లికార్జున్ అని, మానసిక స్థితి సరిగ్గా లేదని, మద్యం మత్తులో బెదిరింపు కాల్స్ చేసినట్లు భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయినప్పటికీ విజయవాడ పోలీసులు నిందితుడిని లోతుగా విచారిస్తున్నారు. గతంలో కూడా వైజాగ్‍లో నూక మల్లికార్జున్‍పై 354 కేసు నమోదైంది. అతడు మద్యం తాగిన మైకంలో దుర్భాషలకు దిగుతాడని ప్రాధమిక విచారణలో తెలుస్తుంది..
