సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య ’ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. ఇటీవల జనసేన అధినేత, తన సోదరుడు పవన్ కళ్యాణ్ ఫై వస్తోన్న విమర్శలువిని తానెంతో బాధపడ్డానని అన్నారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తోన్న తన తమ్ముడిని కొంతమంది వ్య క్తులు హద్దులుదాటి విమర్శిస్తున్నా రని.. అవి విన్నప్పుడు నాకు తట్టుకోవడం కష్టంగా ఉంటుం దని, మనస్సు చివుక్కు మంటుందన్నారు. ‘‘పవన్ నాకు బిడ్డలాంటి వాడు. మా కుటుంబం అంటే అతడికి ఎంతో ప్రేమ. నిస్వార్థపరుడు. డబ్బు , పదవుల మీద అతడికి వ్యామోహం లేదు. నిజం చెప్పాలంటే మొన్నటిదాకా పవన్‌కు సొంత ఇల్లు కూడా లేదు. రాజకీయాలను ప్రక్షాళన చేసి ప్రజలకు ఏదో మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ రంగం వైపు వచ్చాడు. అయితే, పవన్ కళ్యాణ్ ను విమర్శిం చిన వాళ్లతో నేను మాట్లాడాల్సి వచ్చి నప్పుడు కూడా ఇబ్బం దిగా అనిపిస్తుంది’’ అని చిరంజీవి మనస్సులో మాట బయట పెట్టారు.
