సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం నుండి పోటీ కి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకొని ఇక్కడ నివాసానికి ఇల్లు కూడా కొనడానికీ ఏర్పాట్లు చేసుకొన్నా, ఇక్కడ ఇతర పార్టీల నేతల ఇండ్లకు స్వయంగా వెళ్లి తనకు సంఘీభావం తెలపాలని కోరటం కూడా పూర్తీ అయ్యాక.. జనసేనాని ఊహించని విధంగా మొదటి అభ్యర్థుల లిస్ట్ లో తాను భీమవరం నుండి పోటీ చేస్తున్నట్లు ప్రకటించక పోవడం జనసేన కే కాదు టీడీపీ బీజేపీ ఆఖరికి వైసీపీ వారికీ కూడా షాక్ తగిలింది. దానితో పవన్ తాను పోటీ చెయ్యని పక్షంలో తనను పోటీకి దింపుతారని తాను జనసేన లో చేరుతున్నానని మాజీ ఎమ్మెల్యే అంజిబాబు చేసిన ప్రకటన తో పవన్ మరల సందిగ్దతలో ఉన్నారని ప్రజలకు, నేతలకు అర్ధం అయ్యింది. ఆయన సుమారు 2 లక్షల 30 ఓట్లలో 90 వేలు పైగా కాపు ఓటర్లు ఉన్న పీఠ పురం నుండి పోటీ చేసే ఉద్దేశ్యంతో ఉన్నారని మరో ప్రచారం ఊపందుకోవడంతో .. వైసిపి ని పాతాళం లోకి త్రోకుతానని సవాల్ చేసిన పవన్ ను అధికార వైసీపీ పార్టీ ఆయన ఎక్కడ నుండి పోటీ చేసిన దారుణంగా ఓడించాలని కంకణం కట్టుకోవడంతో తాజాగా తన ప్యూహానికి పదును పెట్టింది. ఇప్పటి వరకు ఆ స్థానంలో కాకినాడ ఎంపీ వంగా గీత ను పిఠాపురానికి ఇంచార్జి గా నియమించిన సీఎం జగన్ ఇప్పుడు ఆమె స్థానంలో పిఠాపురం నుంచి ఏకంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని బరిలోకి దించాలని యోచిస్తున్నారు అని సమాచారం.. తన జాతి ప్రయోజనాల కోసం అవమానాలు దిగమ్రింగి జనసేన లో పనిచేయాలని భావించానని పవన్ తన ఇంటికి వస్తానని 2సారులు చెప్పి చంద్రబాబు అనుమతి లేకపోవడంతో తనను అవమానించాడని బహిరంగ లేఖ రాసిన ముద్రగడ ను వైసిపి నేతలు ఒప్పించి ఒకవేళ పవన్ అక్కడి నుండి పోటీ చేస్తే ఆయన ను బరిలోకి దింపాలని డైరెక్టుగా కాకపోయిన లోపాయకారిగా ఒప్పందం చేసుకొనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పరిస్థితులలో పవన్ భీమవరం లేక పీఠ పురం నుండి కాకుండా తాడేపల్లి గూడెం నుండి పోటీ చేస్తే..?
