సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా నేడు, శనివారం ఆయన నటిస్తున్న “ఓజి “ సినిమాకు సంబందించిన గ్లింప్స్‌ వీడియో ను చిత్ర యూనిట్ ఆయన అభిమానుల కోసం విడుదల చేసారు. దీనిలో ఎప్పటిలాగే పవన్‌కల్యాణ్‌ లుక్స్‌, పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు అభిమానులకు ఫుల్‌ ట్రీట్‌ ఇచ్చేలా ఉన్నాయి. సాహో పేమ్ .. సుజిత్ దర్శకత్వంలో ప్రియాంక ఆరుళ్‌ మోహన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, ఇమ్రన్‌ హస్మీ, అర్జున్‌ దాస్‌, శ్రేయారెడ్డి, హరీశ్‌ ఉత్తమన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ పవర్‌ఫుల్‌ ఈ గ్లింప్స్‌పై మీరూ ఓ లుక్కేయండి! ‘‘వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికీ ఏ తుపాను కడగలేకపోయింది..అలాంటోడు మళ్లీ తిరిగి వస్తున్నాడు అంటే.. సాలా.. షేక్‌.. షివర్‌ ఆ జాయేగా’’ అంటూ అర్జున్‌ దాస్‌ చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంటుంది. పవన్ పాత్రను హైలైట్ చేస్తూ .. ‘నెత్తురుకు మరిగిన హంగ్రీ చీత… చూపుగాని విసిరితే ఒర కంట… డెత్‌ కోట కన్ఫమ్‌ అంట…ఎవరికీ అందనిది అతని రేంజ్‌’’ అంటూ బ్యాగ్రౌండ్‌ సాంగ్‌ తమన్‌ అందించిన సంగీతం అభిమానులను అలరిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *