సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవన్ కళ్యాణ్ ఫై తమిళనాట కేసు నమోదు అయ్యింది. ఇటీవల లడ్డు వివాదం ఫై ప్రాయశ్చిత దీక్షను ముగించుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదుపరి తిరుపతి లో వారాహి సభ ను నిర్వహించి అందులో లడ్డు లో కల్తీ జరిగింది. దానికి కారణం గత సీఎం జగన్ అని మేము అనకపోయిన జగన్ భుజాలు భుజాలు తరుముకొని సుప్రీం కోర్ట్ కు వెళ్లారని, కోర్ట్ లు కూడా హిందూ ఘటనలపై ఫై . తీర్పులు.. ఇతర మతాల ఘటనలపై మాత్రం.. అని విమర్శిస్తూనే .. పేరు ప్రస్తావించకు పోయినప్పటికీ పరోక్షంగా సీఎం స్టాలిన్ తనయుడు ప్రస్తుత డిప్యూటీ సీఎం ఉదయనిది స్టాలిన్‌ నుద్దేశించి ఆయన వ్యాఖ్యలు చెయ్యడంతో.. తమళనాట హాట్ టాపిక్ అయ్యింది. అసలే తమిళ హీరో కార్తీ తో క్షమాపణలు చెప్పించిన పవన్ ఫై మంటకు తోడు అధికార డీఎంకే అభిమానులు పవన్ ఫై సోషల్ మీడియాలో భగ్గుమన్నారు. గొడ్డు మాసం .. బాప్టిజం తీసుకొన్న పవన్ స్వామి హిందూ సనాతన ధర్మాన్ని కాపాడతాడా ? మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప.. అంటూ ఆయన వ్యతిరేకులు తెలుగునాట చేస్తున్న ట్రోలింగ్ తరహాలోనే తమిళనాట సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఈ తరుణంలో ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. సనాతన ధర్మం పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘వెయిట్ అండ్ సి’ అంటూ నవ్వుతూ వెళ్ళిపోయారు. ఈ తరుణంలోనే.. పవన్‌ కళ్యాణ్‌‌పై మధురై‌లో పోలీస్‌ కేసు నమోదైంది. ఓ లాయర్‌ పవన్ కళ్యాణ్‌పై కేసు పెట్టారు పవన్ కళ్యాణ్ ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టేలా ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ కేసు నమోదు పెట్టారు. మరి దీనిపై పవన్‌ కళ్యాణ్ ఎలా రియాక్ట్‌ అవుతారనేది చూడాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *