సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గం జనసేనకు చెందిన వీర మహిళలు నేడు, శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వీరవాసరం ఎంపిటిసి గొల్లిపల్లి విజయలక్ష్మి, ఆకుల మౌనిక తదితర వీర మహిళలు మాట్లాడుతూ .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సామర్ల కోట సభలో ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగత విమర్శలు చేసారని ,పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారంటు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని జనసేనకు చెందిన వీర మహిళలు ఆరోపించారు ఆవిమర్శలపై పవన్ కళ్యాణ్ కు జగన్ క్షమాపణ చెప్పాలన్నారు లేదంటే తాము కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబం పై విమర్శలు చేయవలసి వస్తుందని అన్నారు, తాను అధికారంలోకి రావడానికి రాజకీయాల్లో చెల్లెలు వినియోగించుకున్న జగన్మోహన్ రెడ్డి చివరకు తన చెల్లెలు షర్మిల, తల్లి విజయమ్మలు తెలంగాణకు వలస పోయేటట్లు చేశారన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో లక్ష ఇళ్ళను కూడా ఇవ్వలేకపోయందన్నారు నేడు నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో కేవలం ఫోటో సెక్షన్ కి పరిమితమైందన్నారు. అన్ని ఆరోగ్యపరీక్షలు ఇంటికి వచ్చి ఉచితంగా చేస్తామని కేవలం బిపి, షుగర్ వంటి పరీక్షలు మాత్రమే చేస్తున్నారని ఆరోపించారు. .
