సిగ్మాతెలుగు డాట్, న్యూస్: భీమవరం లో జనసేన నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తీ చేసుకున్నాక.. నేడు, బుధవారం జరగవలసిన పవన్ కళ్యాణ్ తన పర్యటన ను వాయిదా వేసుకోవడం దానికి హెలిప్యాడ్ కు అనుమతించలేదని సాకుగా చెబుతున్నారని తమ ఫై రాజకీయ వత్తడి ఉందని ప్రచారం చెయ్యడం వాస్తవ విరుద్ధం అని జిల్లా ఆర్ & బి అధికారులు అంటున్నారు. విష్ణు కాలేజీ పరిధిలో హెలిపాడ్ ప్రాంతాన్ని 2018 నుండి అనుమతించడం లేదని..? అక్కడ ఉన్న హెలిపాడ్ ప్రాంతానికి 50 మీటర్లదూరంలోనే కొత్తగా నిర్మించిన, నిర్మిస్తున్న అపార్ట్మెంట్లు ,చెట్లు ఉన్నాయి. అక్కడ పవన్ హెలికాఫ్టర్ దిగడానికి ఆ హెలిప్యాడ్ అనువు కాదు అని ఏవియేషన్స్ నిబంధనలు పాటించాలని జనసేన నేతలకు సూచించాం. మరోచోట అనువైన ప్రదేశాన్ని హెలిపాడ్ గా ఎంపిక చేసుకొంటే ఆమోదిస్తాం అని కూడా చెప్పిన, జనసేన నేతలు మీడియాలో మాపై దుష్ప్రచారం చెయ్యడం తగదని అధికారాలు చెబుతున్నారు. అయిన హెలిఫ్యాడ్ లేదని ఎవరైనా పర్యటన ఆపుకొంటారా? హైదరాబాద్ నుండి భీమవరం రోడ్డు మార్గంలో, ట్రైన్ లలో రావడం ఎంత సేపు? పవన్ కు ఇంకా పొత్తులో ఎదో సెట్ కాలేదు.. కావాలని మా పై బురద చల్లడం తప్ప అంటూ స్థానిక వైసీపీ నేతలు నిటూరుస్తున్నారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *