సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా వైఎస్సార్సీపీ నేత ముద్రగడ కుమార్తె ప్రచారం చెయ్యడం, పవన్ తో ఆమె కలసి వేదికను ఎక్కి తనను విమర్శించడం ఫై ముద్రగడ పద్మనాభం నేడు సోమవారం మీడియా సమావేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. పవన్ మీ నటన సినిమాల్లో చూపించండి.. రాజకీయాల్లో కాదు . నేను ఏనాడూ చిరంజీవి, పవన్ కల్యాణ్ కుటుంబాల గురించి మాట్లాడలేదు. ప్రశాంతంగా ఇంట్లో ఉన్న నన్ను పవన్ రోడ్డు మీదకు లాగాడు.నన్ను జనసేన లోకి ఆహ్వానించి తీరా నా ఇంటికి వస్తానని చెప్పి చంద్రబాబు ఆదేశాలతో రాకుండా ఒంటరిగా వదిలేసి అవమానించాడని, హైదరాబాద్ నుంచి వచ్చి నా కుటుంబంలో చిచ్చు పెట్టాడు. పైకి నా మీద ప్రేమ ఉన్నట్లు పవన్ నటిస్తున్నాడు. పవన్ కోసం నన్ను త్రొకేసిన చంద్రబాబు పల్లకి నేను మోయాలా ? అని ప్రశ్నించారు. నాకూ నా కుమార్తెకు మధ్య బంధాలు తెగిపోయాయి అని ఆమె భర్త,.మామకు చెబుతున్నాను. వీలైతే ఆమెను టీవీ డిబెట్లు.. జనసేన ఎన్నికల ప్రచారాలకు తిప్పాలని, అంతేకాని ఆమె తండ్రి పద్మనాభం అని ప్రచారం చెయ్యకండి అని కోరుతున్నాను’ అంటూ తీవ్ర వ్యా ఖ్యలు చేశారు. పవన్ బహిరంగంగా ప్రజలకు ముద్రగడ కూతురు అని నా కుమార్తెను అందరికీ పరిచయం చేశాడు. మీరు వదిలేసిన మీ ఇద్దరు భార్యలను.. ఇప్పుడు కలిసున్న మూడో భార్యను అందరికీ ఎందుకు ప్రజలకు పరిచయం చేయలేదు?అలాగే, మీ కుటుంబంలో డ్రగ్స్ సేవించి పట్టుబడిన అమ్మాయిని ఎందుకు పరిచయం చేయలేదు అలాగే మీ ఇంట్లో నుండి బయటకు వెళ్లి ఎవరినో ప్రేమించి పెళ్లి చేసికొన్న అమ్మాయిని ఎందుకు పరిచయం చెయ్యరు?అని ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేసారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *