సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ లో మంత్రులపై దాడి చేశారన్న ఆరోపణలపై జనసేన నేతల అక్రమ అరెస్టులను తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఖండించారు. నేడు, ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెట్టుకొన్న జనవాణి కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం అడ్డుకోవడానికి కుట్రలు చేస్తుందని ఇది దుర్మార్గమన్నారు. పవన్ బస చేస్తున్న హోటల్‌లో సోదాలు నిర్వహించడం, నాయకులను బెదిరించడం నియంత పాలనకు నిదర్శనమన్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్ దగ్గర దాడులు జరిగాయని చెప్పి పదుల సంఖ్యలో జనసేన నేతలు, కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ర్యాలీకి అనుమతి అడిగిన నేతలపై హత్యాహత్నం సెక్షన్‌ల కింద కేసులు పెట్టి అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.
