సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సచివాలయంలో పనిచేస్తున్న వాలంటీర్లు నేడు, సోమవారం రోడ్లపై కి వచ్చి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏలూరు లో తమపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం తో రగిలిపోతూ నిరసనలు వ్యక్తం చేస్తూ ఆయన దిష్టి బొమ్మలను దగ్ధం చేసారు. కొన్ని ప్రాంతాలలో మహిళా వాలంటీర్లు అయితే తీవ్ర పదజాలంతో పవన్ ను తిట్టి పోశారు. ఈ నేపథ్యంలో భీమవరంలో వాలంటీర్లు నేటి సాయంత్రం స్థానిక అంబేద్కర్ ప్రధాన సెంటర్ లో పట్టణ వీధుల గుండా పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మను ఊరేగింపుగా తీసుకొనివచ్చి, మహిళా వాలంటీర్లు చెప్పు కాళ్లతో తన్నుతూ తదుపరి దహనం చేసారు. పవన్ నోరు అదుపులో పెట్టుకోవాలని వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలని, రాష్ట్రంలో పని చేస్తున్న సుమారు 3 లక్షల మంది వాలంటీర్లు లో 60 శాతం ఆడువారు ఉన్నారు అన్న సృహ లేకుండా.. వాలంటీర్లు వల్లే 30వేల ఒంటరి అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారని తప్పుడు ఆరోపణలు చేసిన పవన్ కు అసలు విలువలు ఉన్నాయా? ప్రజలకు ఇంటింటికి ప్రభుత్వ సంక్షేమ పధకాలు , పింఛనులు తీసుకోని వెళ్లే తమను.. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి తాము రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలు ప్రధాని మోడీ సైతం , ఇతర రాష్ట్రాల సీఎంలు కొనియాడిన విషయం.. పక్క రాష్ట్రంలో నివాసం ఉండి అప్పుడప్పుడు వచ్చే పవన్ కు తెలియదా?అని ప్రశ్నించారు. పవన్ ప్రస్తుతం ఉన్న ఏలూరులో కూడా అయన దిష్టి బొమ్మను వాలంటీర్లు దహనం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *