సిగ్మాతెలుగు డాట్,ఇన్ న్యూస్: ఈ రోజు శుక్రవారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో సాయి ధరమ్ హీరోగా ప్రముఖ నటుడు, తమిళ దర్శకుడు సముద్ర ఖని దర్శకత్వంలో, భీమవరం బ్రాండ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కధ , స్క్రీన్ ప్లే అందించిన ‘బ్రో’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది, తమిళనాడులో గత మూడేళ్ల క్రితం విడుదలైన వినోదయ సిత్తం అనే చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. ఇక మన బ్రో’ సినిమా ఎలా ఉందం టే.. ముందు కధ విషయానికి వస్తే.. ఒక 30 ఏళ్ళ యువకుడు పెద్ద కుటుంబ బాధ్యతలు మోస్తూ అనుకోకుండా ప్రమాదం లో మరణించే ముందు తన కుటుంబం భవిషత్తు ఇంకా జీవించి ఉంటె తాను చేయాలనుకున్న పనులు గురించి ఆలోచిస్తుంటే,, కాలం అనే దేవుడు అతనికి జీవితం లో ఓ వ్య క్తికి కొంత కాలం బ్రతకడానికి రెండో చాన్స్ వస్తే ఎలా ఉంటుంది?దానిని సద్వినియోగం చేసుకుంటాడా? అనే నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ కేవలం 21 రోజులు నటించిన సినిమాలో దాదాపు 80 శాతం సన్నివేశాలలో కనిపిస్తాడు, అయితే ఆయన పాత్ర స్టూడియోలోనే తియ్యడంతో గ్రాఫిక్స్ సన్నివేశాలు ఎక్కువ, పవన్ లుక్స్ పరంగా మాత్రం మంచి హుషారుగా నటించాడు, .సినిమా ప్రారంభమైన పది నిమిషాలకే పవన్ ఎం ట్రీ ఉంటుంది. సినిమాలో పాత్ర చక్కగా కామిడి తో మంచి త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ తో నడిచిపోతుంది, కానీ పవన్ అభిమానులకు అది సరిపోదు, అనిపిస్తుంది, ఇక కాస్త బొద్దుగా మారిన సాయితేజ్ తో కలిసి పవన్ కల్యా ణ్ సన్నివేశాలు బాగున్నాయి, అయితే కొన్ని సన్నివేశాలలో సాయి ధరమ్ తేలిపోయాడు అని చెప్పచ్చు . ఆయన డాన్సులు కూడా కష్టపడుతున్నాడు, సినిమా సెకండాఫ్ చివరికంటూ కాస్త ఎమోషనల్గా సాగుతుంది. అయితే భావోద్వే గాలు ప్రేక్షకులకు చేరవయ్యేలా తీయడంలో దర్శకుడు సముద్ర ఖని కొంత తడబడ్డారు, లవర్ రమ్య గా కేతికా శర్మ పర్వా లేదు. హీరో చెల్లెలు గాయత్రిగా ప్రియాప్రకాశ్ వారియర్ చక్క గా నటించింది. బ్రహ్మానందం ఒకే ఒక సన్ని వేశంలో కనిపిస్తాడు. వెన్నెల కిషోర్ పాత్ర నిడివి తక్కువ..ఇక తమన్ సంగీతం పాటలు పాత ట్యూన్స్ తో నింపాడు. అయితే నేపథ్య సం గీతం బాగుంది. సినిమా డైలాగ్స్ లో తివిక్రమ్ పంచ్ కనిపించింది. అయితే ఇది గోపాల గోపాలా , ఓరి దేవుడా తరహాలో ఒక ఫాంటసీ ప్రయోగం కావడం తో అందరి అంచనాలను అందుకోలేకపోవచ్చు,
