సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సత్తెనపల్లి లో పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు కౌంటర్ గా..మంత్రి రోజా నేడు, సోమవారం మీడియా తో మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కల్యా ణ్ గాని వారి సోదరులు (చిరంజీవి, నాగబాబు) ఎవరు రాజకీయాలకు పనికిరారని ఎందుకంటే వారి స్వంత ఊళ్ళు లోనే పోటీ చేసి ఓడిపోయారని, ( పాలకొల్లు, భీమవరం, నరసాపురం ఎంపీ సీటు) వారి గురించి అక్కడి వాళ్లకు తెలుసునని..అక్కడి ప్రజలకు వాళ్లపై నమ్మకం లేదని అందుకే ఓడించారని సంచలన వ్యాఖ్యలు చేసారు. మీ సోదరులు ఇంటా గెలవలేదు.. రచ్చ గెలవలేరు .. ప్రజలు కోసం సమయం కేటాయించలేరు .. ఇక ఎంతసేపు చంద్రబాబుకు వత్తాసు పలికే పవన్.. ప్రజల సమస్య లు ఎలా పట్టించుకుంటారని ప్రశ్నించారు. రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కు అసలు సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. 2019లో ‘వైఎస్ జగన్ సీఎం అవ్వడు ఇది నా శాసనమన్న’ పవన్ను ప్రజలు అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వలేదని ఎద్దేవా చేసారు. . వైఎస్ జగన్ సీఎం అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న వ్య క్తి ఇప్పుడెందుకు రాష్ట్రములో తిరుగుతున్నాడో అర్థం కావడం లేదని విమర్శించారు. ఆయనను ఒక నటుడిగా అంతా గౌరవిస్తారని, నేను కూడా ఆయన సినిమాలు చూస్తాను.. కానీ ఇక్కడ నివాసం అడ్రస్ లేకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీకెండ్ డేస్ లో వేరే రాష్ట్రము నుండి వచ్చి జనాన్ని రెచ్చగొట్టేస్తే జనం ఆదరించరని పేర్కొన్నారు. సినిమా హీరో వస్తే ఓట్లేసేస్తారనే రోజులు పోయాయన్నారు. పోలవరం గురించి పవన్ కళ్యాణ్ దేవినేని ఉమా మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడని, కేంద్రం కట్టాల్సిన పోలవరాన్ని కమిషన్ల కోసం నాశనం చేసినప్పుడు ఏం చేశాడని ప్రశ్నించారు. చం ద్రబాబును అడగకుండా గతంలో గాడిదలు కాశావా? అంటూ మండిపడ్డారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *