సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో హోమ్ మంత్రి అనిత అసమర్ధత ను నుద్దేశించి డెప్యూటీ సీఎం పవన్ చేసిన గాటు వ్యాఖ్యలు నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు నేడు, సోమవారం సాయంత్రం ఏర్పటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. “ పవన్ కళ్యాణ్ గారు మీరే రాష్ట్రంలో దారుణ పరిస్థితులు ఏకరువు పెట్టినందుకు సంతోషం.. ఇక మీరు అంటున్నట్లు మిరే హోం మంత్రి పదవి తీసుకొని ప్రతాపం చూపండి. ఉత్తర్ ప్రదేశ్ లోని స్వామి ఆదిత్యనాథ్ అవుతారో? కిల్ బిల్ పాండే అవుతారో? కాలమే నిర్ణస్తుంది! హోం మంత్రి అనితకి కి హోం లోనే (కూటమిలో) అసంతృప్తి!” అని అంబటి రాంబాబు ఎద్దేవా చేసారు. కాగా, పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ జాతీయ మీడియాలోనూ వచ్చాయి. మిత్రపక్ష పార్టీ టీడీపీపై పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారని, హోం మంత్రి అనితకు వార్నింగ్ ఇచ్చారని జాతీయ మీడియా కూడా పేర్కొంటోంది.
