సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పరమ శివునికి అత్యంత ప్రీతి పాత్రమైనదిగా పురాణాలు పేర్కొన్న పవిత్ర కార్తీకమాసం మరో 3 రోజులలో పూర్తీ కానుంది. భీమవరం పట్టణానికి ఆ పేరు తెచ్చిన 1200 ఏళ్ల క్రితం నాటి శ్రీ భేమేశ్వర స్వామి దేవాలయంలోనూ..భీమవరానికి సమీపంలోని యనమదఱు గ్రామంలోని స్వయం భువుడుగా వెలసిన శ్రీ శక్తేశ్వర స్వామి దేవాలయంలోను,పట్టణ నడిబొడ్డున 150 ఏళ్ళు క్రితం నిర్మించిన మహిమానిత శ్రీ వీరభధ్ర స్వామి దేవాలయంలో, ఇంకా అనేక శివాలయాలలో భక్తులు విశేషంగా హాజరు అయ్యి పవిత్ర దీపారాధన చేస్తున్నారు. ఈనేపథ్యంలో సాక్షాతూ చంద్ర ప్రతిష్టగా స్కంద పురాణం పేర్కొన్న భీమవరం గునుపూడి లో వేంచేసి యున్న పంచారామక్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు కార్తీకమాసోత్సవములు సందర్భముగా 27వ రోజు సందర్భముగా నేడు, శుక్రవారం భక్తులు విశేషంగా హాజరుయ్యారు. స్వామివారి సేవల వలన రూ.7,182/- , దర్శనం టిక్కెట్ల వలన రూ.40,500/-లు, లడ్డుల వలన రూ.3,915/-లు, అన్నదానం ట్రస్టు నిమిత్తం రూ.78,488/-లు, మొత్తం రూ.1,30,085/-లు వచ్చి యున్నది. ఈరోజుమధ్యాహ్నం అన్నదానం ట్రస్టు ద్వారా 3,200 మందికి అన్నప్రసాదం వితరణ జరిపామని కార్యనిర్వహణాధికారి డి రామకృష్ణంరాజు తెలిపారు.
