సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత కొంత కాలంగా కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన తిరుమల శ్రీవారి ఆలయం లో గతంలో ఎన్నడూ లేని విధంగా వరుస అపచారాలు జరుగుతున్నాయని భక్తులు గగ్గోలు పెడుతున్నారు. తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ వివాదం తెరపైకి వచ్చిన మొదలు.. వైకుంఠ ద్వారం టోకెన్స్ కోసం క్యూ లైన్ లలో 6 గురు భక్తులు మరణించడం, ఇటీవల వెంగమాంబ అన్న ప్రసాదానికి వెళ్తు భక్తుల త్రొక్కిసటలో ఒక యువకుడు మరణించడం, ఇటీవల తిరుమల దేవాలయ బోర్డు నిర్వహణలోని గోశాల లోఎన్నో ఆవులు మరణించాయని? వాటిని గోప్యంగా ఉంచారని ప్రతిపక్ష విమర్శలకు ఇప్పటి వరకు సమాధానం లేదు. తాజగా సిబ్బంది నిర్లక్ష్యంతో ఎంతో మహిమానిత శ్రీవారి ఆలయంలోకి పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి వెళ్లేందుకు కొందరు భక్తులు ప్రయత్నించారు.అన్ని ద్వారాలు దాటుకొని వారు మహాద్వారం వద్దకు వెళ్ళగానే అక్కడి భద్రతా సిబ్బంది..వారిని అడ్డుకున్నారు. దీంతో చెప్పులును మహాద్వారం వద్ద వదిలేసి ఆలయంలోకి వెళ్లారు భక్తులు. భక్తులు ఎలా వస్తున్నారు ఏ సామానుతో ప్రవేశిస్తున్నారు అనే విషయాన్ని వైకుంఠంలోకి భక్తులు ప్రవేశించే సమయంలోనే విజిలెన్స్, టీటీడీ ఉద్యోగులు గుర్తించాల్సి ఉంటుంది.అయితే అక్కడి సిబ్బందికి ఫై చూపులే తప్ప క్రింది చూపులు లేవని ఈ ఘటనతో అర్ధం అవుతుంది. ఆ భక్తుల బుద్ది ఏమయిందో?ఏది ఏమైనా తిరుమల తిరుపతి పవిత్రత ఫై పార్టీల రాజకీయాలకు అతీతంగా ధార్మిక సంఘాలు భక్తులు అలర్ట్ కావలసి ఉంది.
