సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలోని ఆక్వారైతులు దిగాలుగా ఉన్నారు. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 1 లక్ష 20వేల ఎకరాలలో రొయ్య సాగుచేసే రైతులు పరిస్థితి దారుణంగా తయారయ్యింది. దక్షిణ భారతదేశంలోనే అత్యధిక రొయ్య ఎగుమతులు చేసే భీమవరం ఆక్వా మార్కెట్ లో నిరాశ అలముకొంది. ఇప్పటికే పెరిగిన మెతల ధరలు, మందుల ధరలు, కరెంట్ బిల్లులు, నిర్వహణా ఖర్చుల కష్టాలకు తోడు, (ప్రభుత్వ ధరలు నిర్ణయించినప్పటికీ మార్కెట్ లో ఏ రోజు ఏ ధర ఉంటుందో తెలియని మార్కెట్..) ..అకస్మాత్తుగా అమెరికా అడ్జక్షుడు ట్రంప్ పెంచేసిన సుంకాల ప్రభావం తో అకస్మాత్తుగా 26% టాక్స్ పెరగటంతో అక్కడ ఎక్కువ రేటుకు కొనాలి కాబ్బటి ఇక్కడ డిమాండ్ తగ్గుతుంది. దానితో భారత్ లో రొయ్య ధరల్లో కోత పడింది. కిలోకు ఎగుమతి దారులు రూ.40 వరకు ధర తగ్గించేశారు. ఆంధ్ర ప్రదేశ్ నుండి ఎగుమతి అయ్యే రొయ్యలపై దీని ప్రభావం బాగా పడింది. మనదేశం నుండి విదేశాలకు ఎగుమతి అయ్యే రొయ్యల్లో 40 శాతం ఎగుమతి ఒక్క అమెరికా కే వెళుతున్న నేపథ్యంలో దీనితో వేలాది కోట్ల రూపాయలు విదేశీ ఆదాయం సమకూరుతుంది. ఆంధ్రప్రదేశ్లోని రొయ్య రైతుదారుణంగా నష్టపోనున్నారు.. 100 కౌంట్ రొయ్య ప్రస్తుత ధర రూ.240 వరకు ఉండగా అది ఇప్పుడు రూ.200 పడిపోతుందని ఆక్వా వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.
