సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక కలెక్టర్ సుమిత్ కుమార్ బదిలీ కావడంతో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా సి.నాగరాణి గత శుక్రవారం మధ్యాహ్నం భీమవరంలోని కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ గా సి.నాగరాణి మాట్లాడుతూ.. జిల్లా లో అందరి అధికారుల సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని, అన్ని వర్గాల ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరిస్తానని అన్నారు, ఇంతకుముందు ఆమె ఐటీడీఏ, గ్రామీణ ఉపాధి హామీ, చేనేత– జౌళి, సాంకేతిక విద్య వంటి శాఖల్లో ఉన్నతాధికారిగా పనిచేశారు. జిల్లాల పునర్విభజన తర్వాత నూతన పశ్చి మగోదావరి జిల్లాకు తొలిసారిగా పి.ప్రశాంతి 2022 ఏప్రిల్ నాలుగో తేదీ నుంచి 2024 ఫిబ్రవరి 17 వరకు పనిచేశారు. ఆమె బదిలీ అనంతరం కలెక్టర్ గా సుమిత్ కుమార్ గాంధీ ఫిబ్రవరి 20వ తేదీ నుంచి కొద్ది నెలలపాటు పనిచేశారు. ఇటీవల బదిలీల్లో భాగంగా ఆయన సీఎం చంద్రబాబు చెందిన స్వంత జిల్లా, చిత్తూరు జిల్లాకు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో కొత్త కలెక్టర్ గా సి.నాగరాణి నియమితులయ్యారు.
